ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ తెలంగాణ అందం తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. షో ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. సోనియా ఆట తీరును చూసి బిగ్ బాస్ షో చివరి వరకు ఉంటుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ అదేమీ జరగలేదు. షో సాగే కొద్దీ అనవసరమైన లవ్ ట్రాక్ తో పూర్తి నెగెటివిటీ తెచ్చుకుంది. దీంతో అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక హౌస్ నుంచి రాగానే తన ప్రియుడు యశ్ వీర్ గ్రోనీని అందరికి పరిచయం చేసింది సోనియా. ఆ వెంటనే పెద్దల ఆశీర్వాదంతో నిశ్చితార్థం, పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు సోనియా దంపతులు. ఇటీవలే ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుందీ బిగ్ బాస్ బ్యూటీ. తాజాగా ఆమె సీమంతం ఘనంగా జరిగింది.

ఇవి కూడా చదవండి

సోనియా సీమంతపు వేడుకల్లో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొని సందడి చేశారు. జబర్దస్త్ ఫేమ్ సుజాత, దంపతులతో పాటు బుల్లితెర నటి కీర్తి భట్ తన ప్రియుడుతో కలిసి ఈ వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు. అలాగే ప్రముఖ యాంకర్ ఓంకార్ కూడా హాజరయ్యాడు.

సోనియా సీమంతం వేడుకలో కీర్తి భట్.. వీడియో..

ప్రస్తుతం సోనియా సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సోనియా దంపతులకు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సోనియా సీమంతం వీడియో..

కాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన  ‘కరోనా వైరస్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది సోనియా ఆకుల. అంతకుముందు మోడల్‌గా కూడా చేసింది. ఇక సోనియా లా కూడా చదివింది.

భర్తతో సోనియా ఆకుల..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *