డ్రాగన్ ఫ్రూట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు.