పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగింది. పోస్టాఫీస్ స్కీమ్స్ రిస్క్ లేకుండా బెస్ట్‌గా ఉండడంతో చాలా మంది అటు వైపు వైపు చూస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ పథకాల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. పోస్టాఫీస్ అందించే మరో అద్భుతమైన పథకం గ్రామ సురక్ష యోజన. ఈ పథకంలో, మీరు రోజుకు 50 రూపాయలు అంటే నెలకు 1500 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.35 లక్షల రూపాయల వరకు అందుకుంటారు. ఈ పథకం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గ్రామ సురక్ష యోజన అంటే ఏంటీ..?
గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టడం ద్వారా బోనస్‌తో సహా రూ. 35 లక్షల వరకు పొందవచ్చు. ఈ మొత్తాన్ని పెట్టుబడిదారుడు 80 ఏళ్ల వయస్సులో అందుకుంటాడు. అంతకుముందే మరణిస్తే నామినీకి డబ్బు మొత్తం అందిస్తారు. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో కనీసం రూ. 10,000 నుంచి గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మీ వీలును బట్టి ప్రతి నెలా, మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏటా ప్రీమియంను డిపాజిట్ చేయవచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా 19 ఏళ్ల వయస్సులో ఈ పథకాన్ని తీసుకుంటే, అతను 55 ఏళ్ల వరకు ప్రతి నెలా దాదాపు రూ. 1,515 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
బోనస్ – రుణ సౌకర్యం..
గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టే వారు ఐదేళ్ల తర్వాత బోనస్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. దీనితో పాటు నాలుగేళ్ల తర్వాత మీరు ఈ పాలసీపై రుణం కూడా తీసుకోవచ్చు. మీరు కోరుకుంటే, పాలసీ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత దీనిని నిలిపివేయవచ్చు. మీరు డిపాజిట్ చేసే ప్రతి రూ.వెయ్యి రూపాయలకు ఏడాదికిరూ.60 బోనస్ వస్తుంది.
మీకు ఎంత మొత్తం వస్తుంది?
మీరు రోజుకు 50 రూపాయలు మాత్రమే ఆదా చేస్తే, అంటే నెలకు దాదాపు 1,500 రూపాయలు డిపాజిట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ పథకం కింద మెచ్యూరిటీ సమయంలో రూ. 35 లక్షల వరకు అందుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 88 కింద పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి
మెచ్యూరిటీ పీరియడ్‌ను బట్టి డబ్బు మారుతుంది
55 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ – దాదాపు రూ. 31.60 లక్షలు
58 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ – దాదాపు రూ. 33.40 లక్షలు
60 మెచ్యూరిటీ పీరియడ్ – దాదాపు రూ. 34.60 లక్షలు
పెట్టుబడిదారుడు 80 ఏళ్లలోపు మరణిస్తే, ఈ మొత్తం మొత్తాన్ని అతని నామినీకి ఇస్తారు.
ఈ పథకం ఎందుకు స్పెషల్?
చిన్న మొత్తాలను పొదుపు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో కావాలనుకునేవారికి ఇది మంచి పథకం. రిస్క్ లేకుండా ఉండాలంటే పోస్టాఫీసు గ్రామ సురక్ష యోజన ఉత్తమం. ఇది బోనస్, రుణం, మంచి రాబడిని అందిస్తుంది. గ్రామాల్లో నివసించే ప్రజలకు కూడా ఇది అద్భుత పథకం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..