తాజా వార్తలు

తాజా వార్తలు


తాజా వార్తలు

బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా కూడా నటీనటుల వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి వ్యవహారాలు సర్వసాధారణం. ఈ విషయాలపై ఈ మధ్యకాలంలో చాలామంది నటులు, నటీమణులు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సరిగ్గా ఆ కోవకు చెందిన నటి ఈమె కూడా. 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. కానీ 9 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆపై సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేసరికి.. ప్రెగ్నెన్సీ వార్తలతో సెన్సేషన్ అయింది. ఈ 38 ఏళ్ల నటి ఓ టాప్ హీరోయిన్. అనేక టీవీ షోలతో పాటు హిందీ, బెంగాలీ, మరాఠీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది. రెండు పెళ్లిళ్లు చేసుకోగా.. ఇప్పుడు ఓ బాబుతో హ్యాపీగా లైఫ్ సాగిస్తోంది. ఆమె మరెవరో కాదు.. పూజా బెనర్జీ.

మొదటి భర్తతో విడిపోయిన అనంతరం పూజా బెనర్జీ.. టీవీ నటుడి నటుడు కునాల్ వర్మతో మూడేళ్లు డేటింగ్ చేసింది. 2017లో వీరిద్దరికి నిశ్చితార్ధం జరగ్గా.. 2020లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆలోగానే కరోనా లాక్‌డౌన్ రావడం అది కుదరలేదు. అయితే పెళ్లి కాకుండానే పూజా ఓ బిడ్డకు జన్మనించింది. ఆపై కునాల్ వర్మను రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆపై తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది.

‘దేవోన్ కే దేవ్ మహాదేవ్’ సిరీస్‌లో పార్వతి దేవి పాత్రను, ‘జగ్ జనని మా వైష్ణో దేవి’ సిరీస్‌లో మాతా వైష్ణో దేవి పాత్రను పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా బెనర్జీ. ‘రోడీస్’, ‘కామెడీ సర్కస్’, ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోలలో పాల్గొంది పూజా. ఈమె బెంగాలీ, మరాఠీ, హిందీ, తెలుగు చిత్రాలలో కూడా పని చేసింది. పూజా బెనర్జీ 15 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తన ప్రియుడు అరుణోయ్ చక్రవర్తిని 2004లో వివాహం చేసుకోగా.. వీరిరువురూ ఆపై 9 సంవత్సరాల తర్వాత 2013లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అరుణోయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత పూజా బెనర్జీ తన నటనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ‘దేవో కే దేవ్ మహాదేవ్’ సిరీస్‌లో పార్వతి దేవిగా నటించి రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంచి రోల్స్ చేస్తూ బుల్లితెరపై ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించింది.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *