మరికాసేపట్లో కింగ్డమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సూపర్ హిట్ కావటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతకు మించి రెస్పాన్స్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. సాయంత్రం ఏడు గంటలకు ఈవెంట్ మొదలు కానుంది. మధ్యాహ్నం నుంచే వేదిక దగ్గర ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. ఈ ఈవెంట్లో అనిరుధ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. గతంలో అనిరుధ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెర్ఫామ్ చేసిన సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కింగ్డమ్ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కింగ్డమ్ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. విజయ్ అన్న పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.