దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వాలు సైతం ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయ్. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ట్రెండ్ కాస్తా ఎలక్ట్రిక్, CNG వాహనాల వైపునకు మారింది. దానికి తగ్గట్టుగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రత్యేకమైన ఫీచర్లతో పూర్తిస్థాయి ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అందులో ఒకటి టాటా పంచ్ ఈవీ.
ఈ కారు ప్రారంభ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 10.45 లక్షలు ఉండగా.. దీన్ని మీరు కేవలం రూ. 40 వేల డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవచ్చు. మిగతాది ప్రతీ నెలా రూ. 25 వేల వరకు ఈఎంఐ కింద కట్టుకోవచ్చు. అయితే ఈ మొత్తం వివిధ రాష్ట్రాలు, ఫైనాన్స్‌లపై ఆధారపడి ఉంటుంది. అలాగే లోన్‌కి మీ క్రెడిట్ స్కోర్ కూడా కీలకం అవుతుంది.
ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 25 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 315 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ కారు 100 కి.మీ వేగాన్ని కేవలం 9.5 సెకన్లలో అందుకుంటుంది. అలాగే గరిష్టంగా గంటకు 140 కి.మీ వేగంతో వెళ్తుంది. అలాగే ఈ కారు బ్యాటరీని చాలా సులభంగా చార్జ్ చేయవచ్చు.ఈ ఎస్‌యూవీలో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. అలాగే పవర్ స్టీరింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, పాసింజర్ ఎయిర్ బ్యాగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఈ టాటా పంచ్ SUVలో ఉన్నాయి. అటు ఈ కారుకు అలాయ్ వీల్స్ అమర్చారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి