
ఏం కొనెట్టు లేదు.. ఏం తినేట్టు లేదు.. అనేటట్టు ప్రస్తుతం బంగారం ధర ఉన్నప్పటికీ మహిళలకు బంగారు వరలక్ష్మి అనే కార్యక్రమం ద్వారా తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. బంగారు రూపంలో లక్కీ డ్రా ధర అందజేస్తున్నారు. బంగారు రూపులు వరలక్ష్మీ వ్రతం కోసం మహిళలు ఇంటి వద్ద తమ పనులన్నీ పక్కనపెట్టి రూపుల కోసం ఎగబడ్డారు. రూపులు ధరలు ఆకాశానికి అంటడంతో, కంబాల శ్రీనివాసరావు లక్కీ డ్రా ద్వారా బంగారు రూపులు ఇస్తున్నారని పెద్ద సంఖ్యలో మహిళలు లక్కీ డ్రా కార్యక్రమానికి చేరుకున్నారు. డ్రా జరిగిన ప్రతి ఒక్క మహిళ సంతోషంతో రూపు కోసం క్యూలో నిలబడ్డారు. ఓ పక్క పసిడికి ధర ఆకాశంఅంటేటట్టు ఉన్నప్పటికీ ప్రజల్లో సనాతన ధర్మం హిందువుల పట్ల చైతన్యం కలిగేలా ఉండాలని నరేంద్ర మోడీ సారధ్యంలో ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా ఈ బంగారు వరలక్ష్మి కానుక ద్వారా మహిళలకు బంగారు రూపంలో అందజేస్తున్నామన్నారు.
గతేడాది కూడా 600 గ్రాముల బంగారాన్ని వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలకు రూపంలో అందజేశామని, ఈ ఏడాది సుమారు 70 లక్షల రూపాయలు వ్యయంతో 20 వేల మంది మహిళలకు లక్కీ డ్రా ద్వారా అందజేశారు. ఈ ఏడాది 1200 మంది మహిళలను ఒక్కొక్కరికి అరగ్రామ చొప్పున బంగారు రూపులను ఇస్తున్నామని కంబాల తెలియజేశారు. ఈ బంగారు వరలక్ష్మి కానుకకు గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఉత్సాహంతో నిర్వహిస్తున్నామని, మహిళలు కూడా నిరుత్సాహపడకుండా గత ఏడాది 600 మందికి ఇస్తే ఈ ఏడాది 1200 మందికి అలా పెంచుకుంటూ ప్రతి ఏడాది ఇస్తానని అన్నారు. మహిళలకు లక్కీ డ్రా ద్వారా తగలని వారికి కూడా శ్రావణ శుక్రవారం సమయంలో కొంతమందికి బంగారు రూపు ఇచ్చేందుకు మరింత ప్రయత్నం చేస్తానని కంబాల శ్రీనివాసరావు లక్కీ డ్రా లో మహిళల సమక్షంలో తెలియజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.