మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ కోసం కండలు పెంచిన రామ్ చరణ్ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ది సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25, 2025న విడుదల కానుందని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. . బుచ్చిబాబు రంగస్థలం స్థాయిలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో సినిమాను తీర్చిదిద్దుతున్నారని, ఇది చరణ్ గ్లోబల్ ఇమేజ్‌ను మరింత పెంచే చిత్రం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి