బిజినెస్

బిజినెస్


జూలై 15 నుంచి రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ ఆధార్‌ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆధార్‌ వివరాలు లేకున్నా.. రిజర్వేషన్‌ కౌంటర్లలో తత్కాల్‌ టికెట్లను జారీ చేస్తున్నారు. మూడు రోజులుగా రిజర్వేషన్‌ సిబ్బంది ఆధార్‌ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు. ఆధార్‌ అథంటికేషన్‌ ప్రక్రియలో ఏర్పడిన టెక్నికల్‌ సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ సీఆర్‌ఐఎస్‌ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యల వల్ల రిజర్వేషన్‌ కౌంటర్లలో తత్కాల్‌ టికెట్ల జారీలో మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు.. ప్రస్తుతానికి ఆధార్‌ రూల్ పక్కనబెట్టారు. ప్రస్తుతం నిమిషానికి 4 టికెట్లు జారీ చేస్తున్నామని, ఆధార్‌ అథంటికేషన్‌ ఓటీపీ కోసం ప్రతి టికెట్టుకూ అదనంగా సమయం పడుతున్నందని, ఈ జాప్యాన్ని నివారించడం కోసమే ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసే దిశగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పనిచేస్తోంది. ఈ ఏడాది చివరికి టికెట్ సిస్టమ్‌కు డిజిటల్ హంగులు చేకూరనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ యాలకుల టీ తాగితే.. బాడీలో అద్భుతమే

వాటి కోసమే సరికొత్తగా హాస్టళ్లు.. మంచి ఆహారం, వైద్య సేవలు లభ్యం

అద్దె ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తికి..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఓనర్‌

నారుమడి కాదు.. గుర్రపుడెక్క.. శ్రీశైలం జలాశయంలో అరుదైన దృశ్యం

రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *