ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటున్నాడు నటుడు సత్యదేవ్. ఈ క్రమంలోనే కింగ్ డమ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడీ ట్యాలెంటెడ్ హీరో. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు శివ అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ లలో విజయ్ తో పాటు సత్యదేవ్ కూడా హైలెట్ అయ్యాడు. దీంతో కింగ్ డమ్ సినిమాతో అతని పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. కాగా సోమవారం రాత్రి జరిగిన కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్యదేవ్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించాడు. అతను విజయ్ దేవరకొండ కాదని విజయ్ బంగారు కొండ అని కితాబిచ్చాడు. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతోన్న విజయ్ ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాడు. ఇక ఈ సినిమాకు హార్ట్ బీట్ అయిన అనిరుధ్ రవిచందర్ కూడా విజయ్ పై ప్రశంసలు కురిపించాడు. విజయ్ కారణంగానే తాను కూల్ గా వర్క్ చేశానని కితాబిచ్చాడు.