విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానుల పట్ల తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ఆదరణను తానెప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. “మీరు నాకు దేవుడిచ్చిన వరం” అంటూ ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గత కొంతకాలంగా తన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా… అభిమానులు మాత్రం ఎప్పటిలాగే అండగా నిలిచారని, ప్రతి సినిమా టైం లోనూ తన విజయం కోసం వారు ఎంతగానో కోరుకుంటున్నారనీ విజయ్ అభిమానం గల గర్వంగా చెప్పారు. ఇటీవల తిరుపతిలో విడుదలైన ట్రైలర్‌కి వచ్చిన స్పందన గురించి మాట్లాడుతూ– “ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది అభిమానులు ‘ఈసారి మన హిట్ కొడుతున్నాం’, ‘ఈసారి మన సినిమా టాప్ లో ఉంది’, ‘మనకే హిట్ గ్యారెంటీ’ అంటూ కామెంట్లు చేశారు. ఏ ఒక్కరు కూడా ‘నీకు హిట్ వస్తుంది’ అనలేదు. అందరూ ‘మనకే’ అనడం చూసి నా హృదయం ఉప్పొంగిపోయింది,” అని తెలిపారు.
ఈ ప్రేమే తనకు అసలైన బలం అని చెప్పిన విజయ్, “మీరు నన్ను మీ వాడిని చేసుకున్నారు… అందుకే ఇలాంటి మాటలు వింటున్నాను,” అని ఎమోషనల్ అవుతూ చెప్పారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మొత్తం తన సినిమా కంటే ఎక్కువగా అభిమానుల గురించే మాట్లాడారు ఆయన.