తాజా వార్తలు

తాజా వార్తలు


1994లో ఒసాకాలో.. కన్సాయ్ విమానాశ్రయం తన కార్యకలాపాలు ప్రారంభించింది. నాటి నుంచి ఏటా 3 కోట్లమంది విమాన ప్రయాణికులు దీని నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, గత 30 ఏళ్లలో ఈ విమానాశ్రయం 8 సార్లు స్కైట్రాక్స్ అవార్డును గెలుచుకుంది.లగేజీ పికప్‌కు ముందు ఉండే వెయిటింగ్ టైమ్, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీలను కనిపెట్టి యజమానులకు అప్పగించటం వంటి అంశాలకు సంబంధించిన గణాంకాలు సేకరించి, ఈ అవార్డును ఇస్తారు. ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు కోటి లగేజీలను అందజేసింది. కాగా, ఈ విమానాశ్రయం ట్రాక్ రికార్డ్‌ ఇంత గొప్పగా ఉండటానికి కారణం.. ఇక్కడి మల్టీలేయర్డ్ చెకింగ్ విధానమేనట. ఈ విమానాశ్రయంలో ఒక్కొక్క బ్యాగును పర్యవేక్షించేందుకు సగటున ముగ్గురు సిబ్బంది ఉంటారు. విమానం దిగిన వారికి వారి లగేజీని సకాలంలో అందించటం.. ఏ కారణంతోనైనా లేటయితే.. అదెక్కడుందో గుర్తించి తీసుకొచ్చి అప్పగించటం వీరి ప్రధాన బాధ్యతలు. విమానం వచ్చిన పావు గంటలోనే వారికి తమ లగేజీని అందిచటం తమ ఎయిర్‌పోర్టు ప్రత్యేకత…అని అక్కడ లగేజీ సరఫరా వ్యవహారాలు చూసే అధికారి తెలిపారు. లగేజీ వివరాలను మాన్యువల్ గా , డిజిటల్‌గా ట్యాగ్ చేయటంతో బాటు ఇక్కడి సిబ్బంది.. తమ దేశపు ఆతిథ్య కళ.. ఓమోటేనాషిని ఆకళింపు చేసుకోవటమే ఈ విజయానికి కారణమని ఆయన తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉనికి కోల్పోతున్న ఆ బుల్లి గ్రహం.. తన పుట్టుకకు కారణమైన నక్షత్రం ద్వారానే నాశనం

ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలు.. ఏకంగా కత్తులతోనే

గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ లేకున్నా తత్కాల్‌ టికెట్లు

రోజూ యాలకుల టీ తాగితే.. బాడీలో అద్భుతమే

వాటి కోసమే సరికొత్తగా హాస్టళ్లు.. మంచి ఆహారం, వైద్య సేవలు లభ్యం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *