కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న ఈ చిన్న గ్రహానికి ‘టీఓఐ 1227–బీ’అని నామకరణం చేశారు. ఇలా నామకరణం చేశారో లేదో అలా అది సైజు తగ్గిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. పాత సినిమాల్లో దేవతల తీక్షణమైన చూపునకు రాక్షసులు కాలి భస్మమైపోయినట్లు ఇప్పుడు బుల్లి గ్రహం సైతం తన పుట్టుకకు కారణమైన నక్షత్రం నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్–రే కిరణాల ధాటికి నాశనమవుతోంది. గ్రహం తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతోంది. దీనివల్ల అది కుచించుకుపోతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నాసా చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ ద్వారా ఈ బుల్లి గ్రహం క్షీణించిపోతున్న వైనాన్ని ఖగోళవేత్తలు గమనించారు. ఈ వివరాలు ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ బుల్లిగ్రహం తన పేరెంట్ నక్షత్రం చుట్టూ దగ్గరగా పరిభ్రమిస్తోంది. దీనివల్ల ఆ నక్షత్రం నుంచి వెలువడుతున్న అత్యంత తీవ్రస్థాయి రేడియేషన్ ఈ గ్రహంపై పడుతోంది. ఈ గ్రహం మన భూమికి రెండు రెట్లు బరువుంది. విశ్వంలో భిన్న పరిస్థితులు ఎలాగైతే ఇలాంటి బుల్లి గ్రహాలకు పురుడుపోస్తాయో, మళ్లీ అవే భిన్న పరిస్థితులు ఆ గ్రహాల మీది వాతావరణాన్ని అంతర్థానం చేస్తాయనే విషయాన్ని మరింత లోతుగా తెల్సుకునేందుకు ‘టీఓఐ 1227బీ గ్రహం’ పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలు.. ఏకంగా కత్తులతోనే
గుడ్‌న్యూస్.. ఆధార్ లేకున్నా తత్కాల్ టికెట్లు
రోజూ యాలకుల టీ తాగితే.. బాడీలో అద్భుతమే
వాటి కోసమే సరికొత్తగా హాస్టళ్లు.. మంచి ఆహారం, వైద్య సేవలు లభ్యం
అద్దె ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తికి..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఓనర్