ఈ మధ్య కొత్త హీరోయిన్స్ సందడి ఎక్కువైంది. ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా జోరులో కొత్త హీరోయిన్స్ తమ సత్తా చాటుతున్నారు. ఇతర భాషల నుంచి కూడా కొత్త కొత్త హీరోయిన్స్ తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్న బ్యూటీ రుక్మిణి వసంత్. కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా గుర్తుందా.? ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్. బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారికి ఇప్పుడు సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ హీరోయిన్. ఈ సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
దీంతో తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కన్నడలో శ్రీమురళీకి జోడిగా భఘీర చిత్రంలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.. అలాగే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే తమిళంలో విజయ్ సేతుపతి జోడిగా ఏస్ అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందని టాక్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
ఇదిలా ఉంటే రుక్మిణి ఎన్టీఆర్ సినిమాతోపాటు ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ విక్రమ్. ఇప్పటికే తమిళ్ లో విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సినిమాల్లో నటించిన రుక్మిణి ఇప్పుడు విక్రమ్ తో జోడీ కట్టనుందని తెలుస్తుంది. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లో 64వ సినిమా. ప్రేమ్‌కుమార్ ఇప్పటికే 96, సత్యం సుందరం సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. కాగా వరుసగా అవకాశాలు అందుకుంటున్న రుక్మిణి త్వరలోనే స్టార్ హీరోయిన్ గా మారుతుందని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రుక్మిణి తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. కవ్వించే కళ్లు.. నిషా చూపులతో చంపేస్తోంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Source link