ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. ఓ దంపతులు బైక్ మీద వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని రూ. 10 వేలు కట్టమని చెప్పారు. దీంతో సదరు బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే నేరుగా ఘటనాస్థలికి చేరుకొని.. ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నానని.. తక్షణమే బైక్‌ను బాధితులకు హ్యాండోవర్ చేయాలని…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. జిల్లాలోని తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. దీంతో ఆ రైతు వజ్రాన్ని దిగుల చింతలకొండలో వేలానికి పెట్టారు. వేలానికి వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. కాగా, రైతు వజ్రాన్ని 18 లక్షల రూపాయిలకు అమ్ముతానని తెలిపారు. దీంతో వ్యాపారులందరూ…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదలవుతుండగా, అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్నదాత సుఖీభవ’ నిధులూ రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇది ఏపీ రైతులకు ఒక పెద్ద ఊరట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు తొలి దశ…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల ఎత్తు నుంచి కృష్ణమ్మ దూకితే ఎట్టా ఉంటాదో తెలుసా.. రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదపోటు ఏ రేంజ్‌లో ఉంటాదో తెలుసా.. ఇదిగో ఇట్టా ఉంటాది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షాలకు బిరబిరా పరుగెడుతోంది.శ్రీశైల మల్లన్న చెంత ఉధృతంగా ప్రవహిస్తూ.. నాగార్జునసాగర్‌వైపు పోటెత్తింది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి….

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

డ్యామ్ పై నుంచి ఈ సీన్ ను చూసి.. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు. అయితే వరద సమయంలో కొట్టుకొచ్చే ఈ గుర్రపు డెక్కను వెంటనే తొలగించకపోతే.. వాటి ఆకులు కుళ్లిపోయి నీరు కలుషితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుర్రపుడెక్క విస్తరిస్తే.. జలాశయంలోని జలచరాలకు కూడా ఇబ్బందేనని వారు చెబుతున్నారు. 2018 సంవత్సరంలో కూడా ఇలానే గుర్రపుడెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చిందని, అప్పట్లో వారం రోజుల సమయంలోనే దానిని తొలగించారని వారు గుర్తుచేస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని ఎస్బిఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంకు వెనక వైపు నుంచి కిటికీ ఇనుప చువ్వలను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు ఎంత చోరీ జరిగింది అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్యాంకులోని సిసి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు. బ్యాంకులోని ఇనుప…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏం కొనెట్టు లేదు.. ఏం తినేట్టు లేదు.. అనేటట్టు ప్రస్తుతం బంగారం ధర ఉన్నప్పటికీ మహిళలకు బంగారు వరలక్ష్మి అనే కార్యక్రమం ద్వారా తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. బంగారు రూపంలో లక్కీ డ్రా ధర అందజేస్తున్నారు. బంగారు రూపులు వరలక్ష్మీ వ్రతం కోసం మహిళలు ఇంటి వద్ద తమ పనులన్నీ పక్కనపెట్టి రూపుల కోసం ఎగబడ్డారు. రూపులు ధరలు ఆకాశానికి అంటడంతో, కంబాల శ్రీనివాసరావు…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత భార్యపై అతనకు అనుమానం మొద లైంది. అది శృతిమించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆఖరిగా ఆమెను అంత మొందించాడు. రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరుకు చెందిన ఉషారాణి(45)కి నర్సీపట్నం మండలం గిడుగుటూరుకు చెందిన…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది….

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి…

Read More