
బిజినెస్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ కంపెనీకి ఇండియాలో పరిమితులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించే స్టార్‌లింక్ భారతదేశంలో 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్, ఇతర టెలికాం కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్ సమీక్ష సమావేశంలో టెలికాం శాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. స్టార్‌లింక్…